Skip to main content

TS 10th Class Results 2023 : తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..? ఒకవేళ ఆల‌స్యం అయితే మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో పదో తరగతి ప‌బ్లిక్ పరీక్షల విడుద‌లపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెల‌కుంది. ఏప్రిల్ 3వ తేదీన నుంచి ఏప్రిల్ 11వ తేదీ వ‌ర‌కు టెన్త్ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెల్సిందే.
TS 10th Class Results Release Date 2023 Telugu News
TS 10th Class Results 2023 Details

రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఈ ఏడాది రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలో ఫ‌లితాలను త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. 

అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే..

ap inter and 10th results 2023

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మే 6వ తేదీన ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఏపీలో ఇప్ప‌టికే ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ సారి ఏపీలో మాత్రం రికార్డ్ స్థాయిలో ప‌రీక్ష‌లు ముగిసిన‌ 18 రోజుల‌కే టెన్త్‌ ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఇంట‌ర్ ఫ‌లితాల‌ను కూడా కేవలం 22 రోజుల వ్యవధిలో ఈ ఫలితాలను ప్ర‌క‌టించారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

కానీ తెలంగాణ‌లో మాత్రం ఫ‌లితాల విడుద‌ల కాస్త ఆల‌స్యం అయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. అన్ని అనుకులంగా ఉంటే.. ఈ ఫ‌లితాల‌ను మే 15వ తేదీన‌  వెల్లడించాలని అధికారులు భావిస్తోంది. ఒకవేళ ఫ‌లితాల విడుద‌ల‌ ఆల‌స్యం అయితే మాత్రం మే 16వ తేదీ నుంచి 21వ తేదీలోపు ఎప్పుడైన విడుద‌ల చేసే అవకాశం ఉంది. ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను https://results.sakshieducation.com/లో చూడొచ్చు.

☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

How to check TS 10th Class 2023 Results:

Results

Visit https://results.sakshieducation.com

➤ Click on TS 10th Class 2023 results on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

☛ AP Tenth Class Result 2023 Links : బ్రేకింగ్ న్యూస్.. టెన్త్ ఫ‌లితాలు.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

ఆల‌స్యంకు కార‌ణం ఇదేనా..?
మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్‌ వాల్యూయేషన్‌ ఆలస్యం అయింద‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే టెన్త్‌ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

☛ Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

Published date : 05 May 2023 07:17PM

Photo Stories