AP Tenth Class Result 2023 Links : బ్రేకింగ్ న్యూస్.. నేడే టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)
ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను https://results.sakshieducation.com/లో చూడొచ్చు.
How to check AP SSC 10th Class Results 2023?
- Visit https://results.sakshieducation.com
- Click on AP SSC 10th class results 2023 link available on the home page
- Enter the roll no. and click on submit button
- The results will be displayed
- Download and save a copy for further use.
☛ ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షలు-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి (Click Here)
ఈ సారి మూల్యాంకన ప్రక్రియను..
ఏప్రిల్ 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొన్నారు. వాల్యుయేషన్ పూర్తైన తర్వాత ఇతర ప్రొసీడింగ్స్ కూడా త్వరిగతిన పూర్తి చేశారు. ఈ సారి అత్యంత త్వరగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.
☛ AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
విద్యార్థులకు మేలు చేసేలా మార్కులు ఇలా..
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఎవరైనా విద్యార్థి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షలు-2023 ఫలితాల పూర్తి వివరాలు ఇవే..
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
☛ Government Jobs: పది, ఇంటర్ అర్హతతోనే సర్కారీ కొలువులెన్నో..!