Skip to main content

National Education Policy: సర్కారుబడుల్లో వృత్తివిద్య కోర్సులు

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో నైపుణ్యానికి పదును పెట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
National Education Policy
సర్కారుబడుల్లో వృత్తివిద్య కోర్సులు

 జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన బడుల్లో నూతన హంగులు సమకూర్చాలనే లక్ష్యంతో పీఎంశ్రీ పథకం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఉపాధి చదువు (వృత్తివిద్య) అందించాలని నిర్ణయించింది. పదో తరగతి వరకున్న పాఠశాలల్లో రెండు దశల్లో కోర్సులు నేర్పిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు లెవల్‌–1 పేరిట విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఏదైనా ఒక వృత్తివిద్య నేర్చుకోవాలని మానసికంగా సిద్ధం చేస్తారు.

రెండో దశలో విద్యార్థులు కిందటి తరగతిలో పేర్కొన్న కోర్సుకు తగిన శిక్షణ, క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తారు. పదోతరగతి వార్షిక పరీక్షలు ముగిసేనాటికి విద్యార్థులు నేర్చుకున్న అంశంలో పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు. మిగతా రెండు దశలను ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న విద్యాసంస్థల్లో అమలు చేయనున్నారు.

చదవండి: Sakshi: గిరిజన విద్యార్థినికి బంగారు పతకం

తొమ్మిది పాఠశాలల్లో..

పదోతరగతి పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి కల్పించే జనాదరణ పొందిన కోర్సులు అందించాలని నిపుణులు సూచించారు. ఇందుకు ప్రత్యేక అవసరమున్న బోధకులను నియమించనున్నారు. జిల్లాలో ఇప్పటికే ఐదు మోడల్‌ స్కూళ్లలో ప్రవేశపెట్టగా మరో తొమ్మిది పాఠశాలల్లో స్వయం ఉపాధి కోర్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టారు. విద్యార్థులు సులభంగా నేర్చుకునేందుకు వీలున్న 19 రకాల కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ప్రతీ పాఠశాల నుంచి అందులో ఏవైనా రెండు కోర్సులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రయోగాలు కూడా నిర్వహిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన కోర్సుల్లో క్షేత్రసందర్శన ఉంటుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా కోర్సులు ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ఎంపికై న పాఠశాలలివే..

వృత్తివిద్య కోర్సులు ప్రవేశపెట్టేందుకు జిల్లాలో తొమ్మిది పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో జెడ్పీహెచ్‌ఎస్‌ తీగలపహాడ్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ దండేపల్లి, జెడ్పీహెచ్‌ఎస్‌ రేచిని, జెడ్పీహెచ్‌ఎస్‌ దేవులవాడ, జెడ్పీహెచ్‌ఎస్‌ నీల్వాయి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెన్నూర్‌, టీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ బాయ్స్‌ బెల్లంపల్లి, తాళ్లగురిజాల, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ లక్సెట్టిపేట్‌ పాఠశాలలున్నాయి.

వృత్తివిద్యకు ప్రాధాన్యమివ్వాలి

వృత్తివిద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సమగ్రశిక్ష రాష్ట్ర అదనపు పథ సంచాలకుడు జీ రమేశ్‌ సూ చించారు. అక్టోబ‌ర్ 17న‌ వృత్తివిద్య కోర్సుల అమలుపై జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో రెండు ట్రేడ్లు ఎంపిక చేసుకుని నాణ్యమైన శిక్షణ ఇ ప్పించడంతో పాటు పాఠశాల, ఇంటర్‌ విద్య పూర్తయ్యేసరికి విద్యాసామర్థ్యాలతో పాటు వృత్తివిద్య సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించటానికి కృషి చేయాలన్నారు.

విద్యార్థిదశలో ఉండగానే గత వృత్తి నైపుణ్యాల ద్వారా సొంతంగా సంపాందించుకునేలా తీర్చిదిద్దే అవకాశాన్ని అందించాలని సూచించారు. సమావేశంలో సెక్టోరల్‌ అధికారులు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Published date : 18 Oct 2023 04:23PM

Photo Stories