Skip to main content

Adilabad: యూడైస్‌లో వెనుకంజ

ఆదిలాబాద్‌ టౌన్‌: అధికారుల నిర్లక్ష్యం, కొంత మంది ఉపాధ్యాయుల అలసత్వం కారణంగా విద్యాశాఖ అభాసు పాలవుతోంది.
UDISE Plus

ఏ కార్యక్రమంలోనూ జిల్లా ముందంజలో ఉండటంలేదు. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారట్లేదు. తాజాగా యూడైస్‌కు సంబంధించి రా ష్ట్రస్థాయిలో జిల్లా అధమ స్థానంలో నిలవడం గమనార్హం. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను డిసెంబ‌ర్ 15 వరకు యూడైస్‌ ప్లస్‌ ఆన్‌లైన్‌లో నమో దు చేయాల్సి ఉండగా, ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అధికారులు చెప్పినప్పటికీ ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతుండడంతో ఈ పరిస్థితి ఉందని తెలుస్తోంది. వీరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులతో పాటు పాఠశాలకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. యూ డైస్‌లో వివరాలు నమోదు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలకు నిధులు విడుదలవుతాయి. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సరఫరా, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న దానిపై నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం.

చదవండి: Science Fair: సైన్స్‌ఫేర్‌ పిలుస్తోంది..

తీరుమారదా..

జిల్లాలో విద్యాశాఖ అధికారులతో పాటు చాలా మంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతి కార్యక్రమం అభాసు పాలవుతోందనే విమర్శలున్నాయి.

రెగ్యులర్‌ అధికారులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తమను ఎవరేమి చేయలేరనే ధీమాతో కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి నిర్లక్ష్యం కారణంగా ఇటు పాఠశాలతో పాటు అటు విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
గతేడాది మావల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ అక్కడి ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయలేదు. దీంతో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో ఆ పాఠశాల ఎంపిక కాలేదు.

బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు పురాతన భవనంలోనే చదువులు కొనసాగించారు. వర్షాకాలంలో పైకుప్పు నుంచి నీరు కారుతుండడాన్ని ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో కలెక్టర్‌ స్పందించి ఆ పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేశారు.

వివరాల నమోదులో వెనుకంజ..

యూడైస్‌ ప్లస్‌ ఆన్‌లైన్‌ నమోదుకు డిసెంబ‌ర్ 15 వ రకు గడువు ఉంది. మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో విద్యార్థులు, పాఠశాల మౌలిక వసతుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. యూడైస్‌ ప్లస్‌ పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాల నమోదులో జిల్లా 25వ స్థానంలో ఉంది.

1,481 పాఠశాలలకు గాను ఇంకా 772 పాఠశాలల వివరాలు నమోదు చేయలేదు. డిసెంబ‌ర్ 13న‌ నాటికి 709 పాఠశాలల వివరాలతో 47.87 శాతం నమోదు కాగా, రాష్ట్రంలో కింది వరుసలో నిలిచింది. అలాగే విద్యార్థుల వివరాల నమోదులో మరింతగా వెనుకబడింది. రాష్ట్రస్థాయిలో 27వ స్థానానికి పరిమితమైంది.

1,431 పాఠశాలల్లో 1,51,740 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు 75,467 మంది విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదు చేశారు. 60,401 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. 49.73 శాతం నమోదైంది.

గడువులోపు పూర్తి చేస్తాం..

యూడైస్‌ ప్లస్‌లో వివరాల నమోదు గడువులోగా పూ ర్తి చేసేందుకు చర్యలు చే పడతాం. రాష్ట్రంలో జిల్లా పరంగా కొంత వెనుకబడి ఉన్న విషయం వాస్తవమే. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం.
– నారాయణ, సెక్టోరియల్‌ అధికారి

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:23PM

Photo Stories