TS Tenth Class : టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు ఇవే.. ప్రశ్నలు తగ్గింపు ఇలా..
వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను తగ్గించారు. గతంలో ఒక్కో విభాగంలో రెండు ప్రశ్నలు (ఎ, బి) ఇచ్చి వాటిల్లో ఒకటి రాయమన్నారు. మొత్తం ఆరు విభాగాల నుంచి ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉండేది. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు ఉండేవి. ఇప్పుడీ ప్రశ్నలను ఆరు ఇస్తారు. విభాగాలుగా కాకుండా మొత్తంగా ప్రశ్నలుంటాయి. ఆరింటిలో నాలుగింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు ఆరు మార్కులు (ఒక మార్కు పెరిగింది) ఉంటాయి.
☛ స్వల్ప సమాధాన ప్రశ్నలు ఆరు ఉంటాయి. వీటికి గతంలో మూడు మార్కులు ఉంటే, ఇప్పుడు ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు.
☛ మరింత స్వల్ప ప్రశ్నలు ఆరు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
☛ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు 20 ఉంటాయి. ఒక్కో దానికి ఒక మార్కు ఉంటుంది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ప్రశ్నపత్రాల విధానంలో మార్పు..
గతంలో ఇచ్చిన మాదిరి ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు రాసే సమయం సరిపోదని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ప్రశ్నపత్రాల విధానంలో మార్పు తెచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థుల పరీక్షల విధానం కఠినంగా ఉందనే ఆందోళనను ‘సాక్షి’ఈనెల 2వ తేదీన వెలుగులోకి తెచి్చంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రశ్నపత్రాల్లో మార్పు చేయాలని ఎన్‌సీఈఆర్‌టీని ఆదేశించింది.