Gurudev School Students: తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
Sakshi Education
చర్ల రూరల్: మండల కేంద్రంలోని గురుదేవ్ పాఠశాల విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పర్యవేక్షకులు వడుగు నాగపద్మిని తెలిపారు.
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21న ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కవి చిగురుమళ్ల శ్రీనివాస్ రచించిన తెలుగుభాష శతక పద్యార్చనలోని 101 పద్యాలను 110 మంది విద్యార్థులు 16 నిమిషాల వ్యవధిలో చదివి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారని తెలిపారు.
చదవండి: Indian Book of Records: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారికి చోటు
పాల్వంచ బొల్లోరిగూడెం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మామిడి రమేష్ మార్గదర్శకత్వంలో గురుదేవ్ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విశాల, ఎం.విజయరాణి, ఎ.హేమలత, పి.సంధ్య, కె.నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రతిభ చాటారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ జుంకీలాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరి ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు అభింనందించారు.
Published date : 22 Feb 2024 03:38PM