Skip to main content

10th Exams Dates: 10వ త‌ర‌గ‌తి కొత్త టైంటేబుల్ ఇదే.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Telangana 10th Exams New Dates
Telangana 10th Exams New Dates

కొత్త టైం టేబుల్‌ను తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం మార్చి 16వ తేదీన (బుధవారం) విడుదల చేసింది. వాస్తవానికి టెన్త్‌ పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినందున ఇంటర్మీడియెట్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.

10th Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..

మార్పు అనివార్యమని భావిస్తే..
ఇదే సమయంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించడం సమస్యగా ఉంటుందని భావించారు. దీంతో టెన్త్‌ పరీక్షలను మే 23 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది. అయితే, మండు వేసవిలో పరీక్షల నిర్వహణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. మార్పు అనివార్యమని భావిస్తే ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

స‌వ‌రించిన టైం టేబుల్ ఇదే..

తేదీ పరీక్ష
23–5–22     మొదటి భాష
24–5–22 ద్వితీయ భాష
25–5–22 తృతీయ భాష
26–5–22 గణితం
27–5–22 జనరల్‌ సైన్స్‌
28–5–22 సోషల్‌ స్టడీస్‌
30–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌)
31–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ (సంస్కృతం, అరబిక్‌)
01–6–22     ఎస్సెస్సీ ఒకేషనల్‌ కోర్సు

​​​​​​​పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 17 Mar 2022 12:33PM

Photo Stories