Sandhya Rani: విద్యార్థులులక్ష్యం వైపు వెళ్లాలి
Sakshi Education
మహబూబ్‌నగర్ క్రైం: విద్యార్థులు వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా చదువులపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి అన్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మాడల్ బేసిక్ ప్రాక్టీస్ హైస్కూల్‌లో నవంబర్ 14న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని, అప్పుడే భవిష్యత్ బాగుంటుందన్నారు.
చదవండి: Google: గూగుల్‌కు భారీ జరిమానా.. చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు రూ.260 కోట్లు ఫైన్
అనంతరం బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు పుట్టపాగ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Published date : 15 Nov 2023 04:11PM