Skip to main content

Google: చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు గూగుల్‌కు రూ.260 కోట్లు ఫైన్

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది.
Google

కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్  (Gaming APP) మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్‌, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (FTC) ప్రకారం.. గూగుల్‌ జూన్ 2016 నుంచి ఏప్రిల్ 2018 మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్‌ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డుకుంది.
వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్.

Income Tax: ఆకర్షణీయంగా కొత్త ఆదాయపన్ను విధానం.. ఇక‌పై జీవిత బీమా పాలసీలపైనా ప‌న్ను..!


ఈ వన్‌ స్టోర్‌ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్‌ యూఎస్‌ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్‌ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్‌లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్‌ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్‌ ఆ ఒ‍ప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కోరిన‌ట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. 
కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని, రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ ఇటీవల రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాల సీఐఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ (CCI) హితవు కూడా పలికింది.

IT industry: ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్‌.. ఇచ్చిన ఆఫర్ల‌ను రద్దు చేసే అవకాశం

Published date : 13 Apr 2023 11:57AM

Photo Stories