G Suhasini: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నవంబర్ 3న కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జిజ్ఞాస, రీసెర్చ్ కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుపై వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి రిసోర్స్ పర్సన్‌గా హాజరై ఆమె హాజరై, మాట్లాడారు. చుట్టూ ఉన్న సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని, నూతన ఆలోచనలతో పరిశోధనలు సాగించాలని విద్యార్థులకు సూచించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు.
చదవండి: State Education Achievement Survey: 547 పాఠశాలల్లో సర్వే
పరిశోధనలు నిత్యజీవితంలో భాగం కావాలని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అన్నారు. కళాశాల జిజ్ఞాస కో–ఆర్డినేటర్ కె.భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ వేదికను సద్వినియోగం చేసుకొని, అధ్యాపకుల సహాయంతో స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులు చేసి, కళాశాలకు సమర్పించాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్ సుహాసినిని సన్మానించారు. వర్క్‌షాప్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య, ప్రమోద్, రీసెర్చ్ కో–ఆర్డినేటర్ కె.మల్లారెడ్డి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ ఎ.శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.