Skip to main content

Rampulla Reddy: విద్యార్థులను ప్రోత్సహించాలి

కడ్తాల్‌: మారుమూల ప్రాంత విద్యార్థులు విద్యను అభ్యసించేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎన్‌ఐఆర్‌డీ మాజీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డబ్ల్యూ.రాంపుల్లారెడ్డి అన్నారు.
Rampulla Reddy
విద్యార్థులను ప్రోత్సహించాలి

 అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్‌లో మూడు రోజుల పాటు కౌన్సిల్‌ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌, ఎస్కే చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా నిర్వహించిన ఉదాత్త జీవితం– ఉన్నత లక్ష్యం, సామాజిక బాధ్యత–మానవీయ విలువలు, నేచర్‌ వాక్‌, ఆరోగ్యం– ఆహారం, విలువల బడి–సామాజిక ఆవశ్యకత, పిల్లల సంరక్షణ– తల్లిదండ్రుల బాధ్యత, జీవన విద్య తదితర ఆంశాలపై విలువలబడి ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అక్టోబ‌ర్ 17న‌ సాయంత్రం ముగిసింది.

చదవండి: School Education Department: ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇలా కుడా

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యార్థులు చదువుకు దూరం కావడానికి తల్లిదండ్రులు, సామాజిక పరిస్థితులే కారణమన్నారు. ఇలాంటి పరిస్థితులను దూరం చేయాలంటే సేవా దృక్పథం ఉన్న సామాజిక వేత్తలతో పాటు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసించేలా ప్రోత్సహించాలని కోరారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఎస్కే చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు ఎస్కే లెనిన్‌బాబును వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పలువురు వక్తలు అభినందించారు.

సీజీఆర్‌ చైర్‌ పర్సన్‌ లీలాలక్ష్మారెడ్డి, సీజీఆర్‌ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ నిపుణుడు సురేందర్‌రెడ్డి, రవికాంత్‌, వనం ప్రసాద్‌, వందేమాతరం రవీంద్ర తదితరులు ఉదాత్త జీవితం, ఉన్నత లక్ష్యం, సామాజిక బాధ్యత, మానవీయ విలువలు, నేచర్‌ వాక్‌, ఆరోగ్యం ఆహారం, విలువల బడి, సామాజిక ఆవశ్యకత, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల బాధ్యత, జీవన విద్య తదితర ఆంశాలపై వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌. సాయిభాస్కర్‌రెడ్డి, ఎస్కే చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు సోమలింగ, రఘువీర్‌, దిలీప్‌, సీజీఆర్‌ సిబ్బంది, బాల చైతన్య కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Published date : 18 Oct 2023 04:25PM

Photo Stories