Kancharla Bhupal Reddy: విద్యార్థులే వ్యవస్థల నిర్మాతలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని తెలిపారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య దూరం కాకుండా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు విషయంలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలో కూడా ప్రోత్సాహించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు, విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించారు.
చదవండి: KGBV: నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా కేజీబీవీ.. బోధనలో ఠీవి
ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్ మున్నా రాజేందర్‌రెడ్డి, ప్రతినిధులు యనాల ప్రభాకర్‌రెడ్డి, గోనారెడ్డి, జీవీ రావు, చెన్నయ్యగౌడ్, గిరిధర్‌గౌడ్, తిరుమలరెడ్డి, అనంతరెడ్డి, రవీందర్, అజిత్, నాగమణి, జ్యోతి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.