Skip to main content

10th Class: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

ఖమ్మం సహకారనగర్‌/కామేపల్లి: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యాన వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్‌ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు.
Special focus on disadvantaged students

ఖమ్మంలోని నయాబజార్‌ ఉన్న త పాఠశాల, కామేపల్లి మండలం కొమ్మినేపల్లి హైస్కూళ్లను ఆయన ఫిబ్ర‌వ‌రి 22న‌ తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా బోధన, విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించాక ఆర్‌జేడీ మాట్లాడారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ప్రత్యేక తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అవసరమైతే ఆదివారం కూడా బోధిస్తూ ఎస్సెస్సీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎంలు నర్సింహారెడ్డి, రవికుమార్‌, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఆర్‌.శ్రీనివాస్‌, ఉషారాణి, రమాప్రభ, శ్రీని వాసరెడ్డి, జ్యోతి, విజయకుమారి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 03:44PM

Photo Stories