Telangana: విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
Sakshi Education
నారాయణఖేడ్ : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనవరి 12న ఖేడ్ ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కన్వీనర్ తెంకటి కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, వసతిగృహాల మెస్, కాస్మోటిక్ చార్జీల బకాయిలను వెంటనే చెల్లించాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.
చదవండి: Clean Survey 2023: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు..!
విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తూ జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పవన్, అనిల్, మహిపాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Published date : 13 Jan 2024 04:07PM