INSPIRE Competitions: రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికైన విద్యార్థులు..
ఇందులో కొణిజర్ల విద్యార్థి డేరంగుల మహేష్, సత్తుపల్లికి చెందిన మారుతి ప్రణీత తదితరులు ఉన్నారు. ఈమేరకు కొణిజర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగగతి విద్యార్థి డేరంగుల మహేష్ రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లషింగ్ టాయ్‌లెట్ రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికై ంది. ఆయన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు బి.హనుమ సూచనలతో ఈ ఎగ్జిబిట్ సిద్ధం చేశారు.
చదవండి: Inspire Goal: విద్యార్థులు భావి శస్త్రవేత్తలుగా ఎదగడమే ఇన్స్‌పైర్ లక్ష్యం..!
పని చేసే విధానం
రద్దీ ప్రాంతాలు, పాఠశాలల్లో ఏర్పాటుచేసే టాయ్‌లెట్లలో మూత్ర విసర్జన అనంతరం నీళ్లు పోయకపోతే దుర్వాసన వెదజల్లుతుంటాయి. దీనిని సరిచేసేందుకు మహేష్ ఆటోమేటిక్ ఫ్లషింగ్ టాయ్‌లెట్ సిద్ధం చేశారు. ఇందులో అడుగున స్పింగ్‌పై బిగించి ఉంచిన బేసిన్‌పై ఎవరైనా మూత్రవిసర్జన చేయడానికి వెళ్లి నిలబడగానే స్ప్రింగ్ సాయంతో బేసిన్ కిందకు వెళ్లి నీళ్లు వచ్చి శుభ్రమవుతుంది. దీనిని తక్కువ ఖర్చుతోనే సిద్ధం చేయొచ్చని గైడ్ టీచర్ హనుమ తెలిపారు. ఈమేరకు రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థి, గైడ్‌టీచర్‌ను ఎంఈఓ మోదుగు శ్యాంసన్, హెచ్‌ఎం శాంతకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.
చదవండి: సివిల్స్ అభ్యర్థులకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'అనిల్ స్వరూప్' సూచనలు..
గర్ల్స్ సేఫ్టీ డివైజ్...
సత్తుపల్లిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్ధిని మారుతి ప్రణీత రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికై ంది. ప్రణీత రూపొందించిన గర్ల్స్ సేఫ్టీ డివైస్ ప్రాజెక్టు ప్రస్తుత సమాజంలో విద్య, ఉద్యోగ రంగాల్లో పని చేస్తున్న మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఆమెకు గైడ్ టీచర్‌గా ఫిజిక్స్ ఉపాధ్యాయులు భద్రయ్య వ్యవహరించగా హెచ్‌ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.