SA 1: పరీక్షల తేదీలు ఇవే..
Sakshi Education
9, 10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరిగే సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)–1 పరీక్షలో 11 పేపర్లు ఉంటాయని తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు.
మేరకు ఆమె అక్టోబర్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఒక సబ్జెక్ట్‌లో ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు ఒక పేపర్, సాయంత్రం 2 నుంచి 4.45 గంటల వరకూ ఒక పేపర్ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
కాగా, పదవ తరగతి ఫైనల్ (ఎస్‌ఏ–2) పరీక్షల్లో మాత్రం 6 పేపర్లే ఉంటాయని దేవసేన స్పష్టం చేశారు.
Published date : 20 Oct 2022 02:03PM