DEO Ashok: పఠనాసక్తిని పెంచేందుకు ‘రూం టు రీడ్’
Sakshi Education
రెబ్బెన(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో పఠనాసక్తి ని పెంచేందుకు రూం టు రీడ్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని డీఈవో అశోక్ అన్నారు.
మండలంలోని కైరిగాం ప్రాథమికోన్నత పాఠశాలను నవంబర్ 23న తనిఖీ చేశారు. వర్క్‌బుక్‌లోని ప్రశ్నలను అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఉపాధ్యాయులందరూ తెలు సుకోవాలన్నారు.
చదవండి: RJD Satyanarayana Reddy: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు రూం టు రీడ్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం ఉండాలని, విద్యార్థులు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేందుకు ప్రత్యేక పీరియడ్ కేటాయించాలని సూచించారు. అలాగే పిల్లలు ఇంటికే పుస్తకాలు తీసుకెళ్లేలా అనుమతించాలన్నారు.
Published date : 24 Nov 2023 03:38PM