పూర్వప్రాథమిక విద్య మరింత పటిష్టం
ఇందులో భాగంగానే ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్స రీతో తరగతులు ప్రారంభించాలని, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నర్సరీ విద్య కూడా అందించాలన్న ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై డిసెంబర్ 2న మంత్రులు çసమీక్ష నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహారం అందించేందుకే పరిమితం చేయకుండా, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్య అందిం చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్‌హోం లోని పిల్లలకు స్టేషనరీ వస్తువులతో కూడిన బ్యాగులు అందించారు.
చదవండి:
958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ
Jawad Storm: ‘జవాద్’ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు
Smallest Camera: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను తయారు చేసిన సంస్థలు?