Online Classes: ఆన్ లైన్ క్లాసులూ నిర్వహించాలి..
. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాస నం ఫిబ్రవరి 3న ఉత్తర్వులు జారీ చేసింది. కరో నాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఫిబ్రవరి 3న ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వారాంతపు సంతల కంటే బార్లు, రెస్టారెంట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉం టుందని వ్యాఖ్యానించింది. వీటి వద్దే ఎక్కువ మంది జనం ఉంటారని, ఇక్కడ కూడా కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో రెండు వారా ల్లోగా నివేదించాలని కోరింది.
అక్కడా అమలు చేయండి: అన్ని మతపర మైన కార్యక్రమాల్లోనూ కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. సమ్మక్క జాత రలో, సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి సూచించింది. నిర్లక్ష్యం వహిస్తే కరోనా ప్రబలే ప్రమాదముంటుందని, అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొం ది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ల తర ఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచం దర్‌తో పాటు న్యాయవాదులు పవన్, చిక్కుడు ప్రభాకర్ ఇతరులు వాదించారు. విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు హాజరయ్యారు.