Tenth Class: వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, కెరమెరి మండలం మోడీ గ్రామంలోని కేజీబీవీని ఫిబ్రవరి 15న డీఈవో అశోక్‌తో కలిసి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పాఠ్యాంశాల పూర్తి, ప్రత్యేక తరగతులు, హాజరు శాతం, అభ్యాస దీపికల తర్ఫీదు, టెస్టుల నిర్వహణ తదితర వివరాలు తెలుసుకున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
సమ్మేటివ్ అసైన్మెంట్, లఘు పరీక్షల జవాబు పత్రాలు, వారికి వచ్చిన మార్కులను పరిశీలించారు. విద్యార్థులతో వివిధ అంశాలపై రాయించారు. అనంతరం భోజనాన్ని పరిశీలించారు. వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కృష్ణారావును ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌వోలు భరత్, శ్రీనివాస్, ప్రత్యేకాధికారి మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.