TS Schols: నేటినుంచి స్కూళ్లలో మానిటరింగ్
ఇందుకోసం మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు రికార్డులు సరిగా రాశారా లేదా, వాటికి ఉపాధ్యాయులు సరైన విధంగా మార్కులు వేశారా లేదా.. అనే అంశాలను మానిటరింగ్ బృందాలు పరిశీలించనున్నాయి.
చదవండి: Teach Tool Observers: రేపు టీచ్ టూల్ అబ్జర్వర్లకు శిక్షణ
20 మార్కులు కేటాయింపు: స్లిప్ టెస్టుకు 5, ప్రాజెక్టు వర్క్‌కు 5, టెక్స్‌బుక్స్ రైటింగ్‌కు 5, ప్రతి స్పందనకు (పుస్తక సమీక్ష) 5 మార్కులు కేటాయించనున్నారు. వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టు 80 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌లో వేసిన 20 మార్కులను పరిశీలించి వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 267 పాఠశాలల్లో మానిటరింగ్ కొనసాగనుంది. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 192, ప్రైవేట్ స్కూళ్లు 75 ఉన్నాయి. రికార్డుల పరిశీలన కోసం మొత్తం 18 మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయులు సహకరించాలి
మానిటరింగ్ బృందాలకు ఉపాధ్యాయులు సహకరించాలి. బందాలు పాఠశాలకు వచ్చిన సమయంలో విద్యార్థుల రికార్డులను అందుబాటులో ఉంచాలి. రికార్డుల పరిశీలన అనంతరం మార్కులను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. అనంతరం మార్కుల జాబితాలను ఎంఈఓలకు అందజేయాలి. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి కావాలి.
–నారాయణరెడ్డి, డీఈఓ.