Skip to main content

Teach Tool Observers: రేపు టీచ్‌ టూల్‌ అబ్జర్వర్లకు శిక్షణ

ఒంగోలు: టీచ్‌ టూల్‌ అబ్జర్వర్లకు జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఈ నెల 13వ తేదీ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Educational training event for tool observers in Ongolu   Training session for tool observers organized in Ongolu district  training for teach tool observers   Ongolu district prepares for training of tool observers

ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాల, మార్కాపురంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శిక్షణ నిమిత్తం 413 మంది అబ్జర్వర్లను జిల్లాలోని మూడు శిక్షణ కేంద్రాలకు కేటాయించినట్లు తెలిపారు. 9 రోజులపాటు నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ట్రైనింగ్‌కు కేటాయించిన అధికారులను సంబంధిత అధికారులు రిలీవ్‌ చేయాలని, కార్యక్రమాన్ని ఉప విద్యాశాఖ అధికారులు, సంబంధిత కోర్సు డైరెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.

చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

Published date : 13 Feb 2024 02:51PM

Photo Stories