Skip to main content

KTR: హెచ్‌ఎంకు కేటీఆర్‌ అభినందన

ఏటూరునాగారం: కొండాయిలో వరద ఉధృతికి గురికాకుండా 40 మంది గిరిజన విద్యార్థులను సాహసోపేతంగా కాపాడి మల్యాలలోని తన ఇంటికి తరలించిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్‌ పాయం మీనయ్యను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌లో అభినందించారు.
KTR
హెచ్‌ఎంకు కేటీఆర్‌ అభినందన

కాగా, 27వ తేదీన కొండాయి ఆశ్రమ పాఠశాలను వరద చుట్టుముట్టింది. దీంతో స్కూల్‌లోని వర్కర్లకు చెప్పి హెచ్‌ఎం మీనయ్య.. పిల్లలను తీసుకుని కల్వర్టు దాటి మల్యాలలోని తన ఇంటికి తీసుళ్లాడు. అనంతరం వర్కర్లను తీసుకుని ఆ కల్వర్టు దాటేలోపు వరద మొత్తం నిండింది. అంతా 30 నిమిషాల్లో జరిగింది. జంపన్నవాగుకు తాత్కాలికంగా పోసిన కరకట్ట తెగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏమీ కాదని ఆశ్రద్ధ చేస్తే ఘోర ప్రమాదం జరిగేది.

చదవండి: Stem Cell: హైదరాబాద్‌లో ‘స్టెమ్‌ సెల్‌’ ల్యాబ్‌!

హెచ్‌ఎం మీనయ్య విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, 1986 సంవత్సరంలో గోదావరి వరద ఏవిధంగా వచ్చిందో ప్రస్తుతం దానికంటే ఎక్కువచ్చిందని హెచ్‌ఎం మీనయ్య తెలిపారు. ‘దేవుడి దయతో బయటపడ్డాం.. గురువారం నుంచి ఇక్కడే ఉన్నా.. పిల్లలను చూసుకుంటున్నా’ అని హెచ్‌ఎం మీనయ్య పేర్కొన్నారు.

చదవండి: Warner Bros Discovery: హైదరాబాద్‌కు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ.. వేల మందికి ఉపాధి

Published date : 31 Jul 2023 03:24PM

Photo Stories