Collector Anurag Jayanthi: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని ప్రభుత్వ స్కూళ్లను ఏప్రిల్ 15న తనిఖీ చేశారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మతులు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.
స్కూళ్లు తెరిచే జూన్ 10వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా అవసరమైన మరమ్మతు పనులు, అదనపు తరగతుల నిర్మాణం టాయిలెట్స్ పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పంపించాలని కలెక్టర్ కోరారు.
ప్రాధాన్యత ప్రకారం పనులు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులకు 20 శాతం మేర నిధులు పనులు ప్రారంభించిన వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. ఆయన వెంట డీఈవో రమేశ్ కుమార్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అవినాష్, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.
చదవండి: Digital Education: పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్య
ఎస్సీ స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ విద్యార్థులు ఎస్సీ స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఏప్రిల్ 15న పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతి, భోజన సౌకర్యాలను తనిఖీచేశారు. స్టడీ సర్కిల్‌లోని విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పక్కా ప్రణాళికతో అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. కేంద్రం సూపరింటెండెంట్ మొహమ్మద్ అజాం, సిబ్బంది పాల్గొన్నారు.