1 నుంచి మన ఊరు–మనబడి స్కూళ్ల ప్రారంభోత్సవాలు
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వీటిని 12 రకాల మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. మొదటి విడత ఎంపిక చేసిన స్కూళ్లలో ఇప్పటి వరకూ 1,200 స్కూల్స్‌లో పనులు పూర్తయినట్లు జనవరి 29న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన ఊరు – మన బడిలో పాఠశాలలను ప్రారంభిస్తున్న గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనాలని, ఇందుకు సంబంధించి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో 3 దశల్లో రూపురేఖలు మార్చేయాలని ప్రభుత్వం సంకలి్పంచిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను రూ. 3,497.62 కోట్లతో ఆధునికీకరిసున్నామని పేర్కొన్నారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీని, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.