Skip to main content

Sub Inspector of Police TVR Suri: ఆ ఇద్దరి చదువుల బాధ్యత నాదే

చర్ల రూరల్‌: తల్లిదండ్రులను కోల్పోయినా విద్యలో రాణిస్తున్న ఇద్దరు పేద విద్యార్థినులను దత్తత తీసుకుని, వారి చదువుల బాధ్యతను చర్ల ఎస్సై టీవీఆర్‌.సూరి స్వీకరించారు.
I am responsible for the education of both of them   SSI TVR Suri supporting two orphaned students

చర్లలోని కస్తూర్భా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి తెలుసుకుని చలించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ విద్యార్థినులిద్దరు ఎంత వరకు చదివినా తనదే బాధ్యత అని, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి సహకరిస్తానని తెలిపారు.

చదవండి: BSF's First Woman Sniper: బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

ఆడపిల్లలు క్రమశిక్షణతో విద్యలో రాణించి ప్రయోజకులై ఇంకొందరికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పినపాక మండలంలో ముగ్గురు విద్యార్థినులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఎస్సై, ఇప్పుడు ఇంకో ఇద్దరి చదువు బాధ్యత స్వీకరించడంపై పలువురు అభినందించారు.
 

Published date : 21 Mar 2024 05:44PM

Photo Stories