Tenth Class: సైన్స్ పరీక్ష రాసిన విద్యార్థి హరీశ్
Sakshi Education
కమలాపూర్: హిందీ ప్రశ్నపత్రం లీక్ ఘటనలో డీబారై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులతో మిగిలిన పరీక్షలు రాసేందుకు అనుమతి పొందిన విద్యార్థి దండబోయిన హరీశ్ ఏప్రిల్ 10న సైన్స్ పరీక్ష రాశాడు.
ఏప్రిల్ 4న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచి్చన ఘటనలో హరీశ్‌ను అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్.. హరీశ్ తరఫున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
దీంతో హరీశ్ మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తన తండ్రి రాజుతో కలిసి ఏప్రిల్ 10న కమలాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి హరీశ్ చేరుకున్నాడు. సంబంధిత అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అప్పటికే అందడంతో విద్యారి్థని పరీక్షకు అనుమతించారు.
Published date : 11 Apr 2023 02:34PM