ఉపాధ్యాయుల శ్రమ వెలకట్టలేనిది: ఎమ్మెల్యే
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలోని ఇల్లంద్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాంకుమార్ అధ్యక్షత ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 35 మందిని శాలువా, పూలమాల, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉందని.. అన్ని రంగాల్లో పురోగమి రాణిస్తున్నారని తెలిపారు.
చదవండి: Teacher's Felicitation: ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం
రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గతేడాది జిల్లా 5వ స్థానంలో రావడం సంతోషకరమన్నారు. ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిపాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా పేరు ప్రఖ్యాతలు రాష్ట్ర స్థాయిలో నిలిపేందుకు ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఎంచుకునే రంగాలను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకు ఇప్పటి నుంచే మోటివేషన్ తరగతులు నిర్వహించాలని కోరారు.
చదవండి: Teacher's Day: గురువుల గురించి గొప్పగా వర్ణించారు
మన ఊరు–మనబడి ద్వారా పాఠశాలల్లో రూపరేఖలు మారుతున్నాయని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉండేందుకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు రాజ్‌మహ్మద్, ఏఎంఓ లక్ష్మణ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, ట్రస్మా నాయకులు సాంబయ్య, శ్రీనివాస్, సురేష్, సతీష్ పాల్గొన్నారు.