Andhra Pradesh: విద్యార్థినులకు ‘స్వేచ్ఛ’తో భరోసా
ఈ మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల డ్రాపవుట్స్ తగ్గించేందుకు ఉచితంగా విద్యతో పాటు, వైద్యం, ఆరోగ్యానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ వారి విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల డ్రాపవుట్స్ తగ్గించేందుకు బాలికలకు స్వేచ్ఛ పథకం కింద శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేస్తోంది. పాఠశాలల్లో కిశోరీ బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తోంది.6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తోంది. బాలికలు రుతుక్రమ సమయంలో ఇబ్బందులు ఎదర్కోవడం పాఠశాలల్లో డ్రాపవుట్స్‌కు కారణమవుతోంది. దీన్ని నివారించేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే కిశోరీ బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది అక్టోబరు 5వ తేదీన ప్రారంభించారు.
చదవండి: School Inspection: ఈ విద్యార్థులపై ఉపాధ్యాయుల శ్రద్ధ ప్రత్యేకంగా ఉండాలి..
అలాగే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అందరి విద్యార్ధుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పాఠశాలల్లో వైద్యశిబిరాల నిర్వహిస్తూ వైద్యపరీక్షలు చేయిస్తోంది. బాలికా విద్యకు ఆటంకం కలగకూడదని,వారు అనారోగ్యం పాలవకూడదన్న ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అవసరమైన న్యాప్‌కిన్లు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 వ తరగతి చదువుతున్న బాలికలు 12,421, 7వ తరగతిలో 12,469, 8వ తరగతిలో 12,007, 9వ తరగతిలో 12,006,10 మంది చదువుతున్నారు. వారికి ప్రతి ఏడాది అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్లు ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
విద్యార్ధినులకు తప్పిన ఇబ్బందులు
ప్రభుత్వం నాప్‌కిన్లు సరఫరాచేయడం వలన కౌమార దశలో విద్యార్ధినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తప్పాయి. రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాం. విద్యార్ధినుల్లో అవగాహన పెరిగింది. ప్రభుత్వం విద్యార్థులకు వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సంతోషకర పరిణామం. విద్యార్ధినుల హాజరుశాతం పెరుగుతోంది.
రమాదేవి, సైన్స్ టీచర్
ఉచితంగా న్యాపికిన్స్ ప్యాడ్స్
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న కిశోరీ బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్స్, ప్యాడ్స్ అందిస్తున్నాం.సైన్స్ ఉపాధ్యాయినులు రుతుక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వేచ్ఛ పథకం అమలు చేస్తుండడంతో బాలికల హాజరు శాతం పెరిగింది.
బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో, విజయనగరం