Skip to main content

7th Class to 10th Class Admissions: భవితకు భరోసా మోడల్‌ స్కూల్‌.. దరఖాస్తు చేయడం ఇలా..

గొల్లపల్లి: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మోడల్‌ స్కూళ్లు విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నాయి.
 Model School Entrance Test 2024-25     Future Assurance Model School     Government Notification for Model Schools Entrance Test 2024-25

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకుల బోధనతో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలో మోడల్‌ స్కూళ్లలో 2024–25 విద్యాసంవత్సరానికిగాను ఖాళీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరో తరగతిలో వంద సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం 2013లో జిల్లాలో 13 ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది.

దరఖాస్తు చేయడం ఇలా..

ఆరో తరగతితోపాటు ఇతర తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 2లోగా http:telanganamr.cgg. gov.inలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ ఆధార్‌ కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌, కులం ధ్రువీకరణ జిరాక్స్‌కాపీలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను ఆన్‌లైన్‌ దరఖాస్తుకు జతచేసి ఆయా మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాల్‌కు అందించాల్సి ఉంటుంది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఓసీలు రూ.100, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ ఒకటి నుంచి 6 వరకు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఏప్రిల్‌ 7న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం..

విద్యార్థులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 100 మల్టీపుల్‌ చాయస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఐదో తరగతి సిలబస్‌, మిగిలిన తరగతులకు ప్రస్తుతం చదువుతున్న తరగతుల నుంచి తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు.

మోడల్‌ స్కూల్‌ ప్రత్యేకతలు..

  • 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత భోధన
  • పక్కా భవనంలో సరిపడా తరగతి గదులు
  • ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యునిఫాం పంపిణీ
  • అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు.
  • విశాలమైన ఆటస్థలం, సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ సదుపాయం
  • అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా రోబోటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ
  • ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులకు తర్ఫీదు
  • నాణ్యమైన మధ్యాహ్న భోజనం
  • 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాల కోసం ప్రత్యేక శిక్షణ
  • పదో తరగతి విద్యార్థులకు ఎన్‌టిఎస్‌ఏకు ప్రత్యేక తరగతులు
  • వృత్తి విద్య, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యూటీషన్‌ కోర్సుల్లో శిక్షణ
Published date : 01 Mar 2024 05:20PM

Photo Stories