Skip to main content

Jenya Events 2023-24: విద్యార్థులకు సృజనాత్మకత ముఖ్యం

మొయినాబాద్‌ రూరల్‌: విద్యార్థులు నాణ్యమైన విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర గురుకులాల పశ్చిమ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్‌ శారదావెంకటేష్‌ అన్నారు.
Empowering Moinabad Rural   Creativity is important for students    Telangana Gurukul Officer Inspires Students

జ‌నవ‌రి 5న‌ మండల పరిధిలోని తోల్‌కట్ట సమీపంలో గల చేవెళ్ల గురుకుల పాఠశాలలో జెన్య ఈవెంట్స్‌ 2023–24, జెన్య ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్‌ ఫెయిర్‌, రంగోళి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

విద్యార్థులు బోధన, అభ్యాసన పరికరాల ద్వారా తరగతి గదుల్లో చేసిన కృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శారదావెంకటేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చేసిన సైన్స్‌ నమునాలు, రంగోళి ఎంతో చక్కగా ఉన్నాయన్నారు.

చదవండి: ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మకమైన రాజ్యపురస్కార్‌ అవార్డు పొందిన విద్యార్థులకు అభినందన

విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని ఆలోచనలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం పెంపొందుతుందన్నారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, ప్రధానోపాధ్యాయుడు నర్సింహ, ఉపాధ్యాయుడు దర్శన్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 06 Jan 2024 03:02PM

Photo Stories