Skip to main content

School Timings Change: పాఠశాలల సమయాల్లో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పాఠశాల సమయాల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు.
School Timings Change
పాఠశాలల సమయాల్లో మార్పులు

అన్ని తరగతులు ఒకే సమయంలో మొదలయ్యేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి పాఠశాలలు గతంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3.45 వరకూ కొనసాగేవి. ఇక నుంచి 9.30కు ప్రారంభమై, 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండేవి. వీటిని 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకూ నడిపిస్తారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ​​​​​​​ఏపీ టెన్త్ క్లాస్

హైస్కూల్‌ క్యాంపస్‌లోనే ఉండే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకూ కొనసాగుతాయి. ఏ స్థాయి స్కూల్‌ అయినా ఉదయం 9.30కే మొదలవుతుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Published date : 25 Jul 2023 11:51AM

Photo Stories