Book Reading: పుస్తకాలు దారిచూపే నేస్తాలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జేవీఎన్‌ఆర్ పాఠశాలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంచార పుస్తక ప్రదర్శన కార్యశాలను ఫిబ్రవరి 6న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పుస్తకాలు దారిని చూపే దీపాలని, పుస్తకాలను మించిన స్నేహితుడు లేడని తెలిపారు.
విద్యార్థులకు పుస్తక పఠనాభిలాషను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. నిర్మల్ అర్బన్, రూరల్ ఎంఈవోలు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విజ్ఞానం అనేది తస్కరించలేని ఆస్తి అన్నారు. సాధ్యమైనంత జ్ఞాన సముపార్జన కోసం కృషి చేయాలని సూచించారు.
చదవండి: Book Fair: సోన్‌లో మొబైల్ పుస్తకమేళా.. ఇందులో భాగంగా విశ్వ పుస్తక మేళా
నేషనల్ బుక్ ట్రస్ట్ కార్యశాల విషయ నిపుణులు కొండూరు పోతన్న మాట్లాడుతూ.. విభిన్న రచయితలు, కవులు, సాహితీవేత్తల పుస్తకాలను విరివిగా చదవడం ద్వారా సాహితీ అభిలాష పెంపొందుతుందన్నారు. రెండు రోజులపాటు నిర్మల్ ప్రధాన కూడళ్లలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారి పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కుభీర్ ఎంఈవో విజయ్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ మణికుమారి, డీఎస్‌వో వినోద్‌కుమార్, కడారి దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |