Skip to main content

10th Class: ‘పది’లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధన దిశగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌ అన్నారు.
Best results should be achieved in 10th Class

ఫిబ్ర‌వ‌రి 15న‌ జిల్లా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా విద్యాశాఖ, పంచాయతీ శాఖ అధికారులు, మున్సిపల్‌ అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ‘పది’ వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా కృషి చేయాలన్నారు. ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడంతోపాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తరగతులు నిర్వహించాలని తెలిపారు. మార్చి ఒకటి నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా వి ద్యాధికారి ఎస్‌.యాదయ్య పాల్గొన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

జిల్లాలో పాఠశాలలు, పదో తరగతి విద్యార్థుల వివరాలు

యాజమాన్యం

స్కూళ్ల సంఖ్య

బాలురు

బాలికలు

మొత్తం

ప్రభుత్వ పాఠశాలలు

07

129

78

 207

లోకల్‌బాడీ

 100

1578

1371

2949

ఎయిడెడ్‌

03

 36

35

71

కేజీబీవీ

18

 0

 531

531

టీఎస్‌ఎంఎస్‌

05

257

 212

469

ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐ

07

 270

 217

 487

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌

09

374

 303

677

టీఎంఆర్‌ఎస్‌

03

 93

61

 154

టీఎస్‌ఆర్‌ఎస్‌

01

 59

 0

59

జీఏహెచ్‌ఎస్‌

13

231

 200

431

ప్రైవేట్‌

 79

1763

1500

 3263

మొత్తం

 245

4790

4508

9298

Published date : 16 Feb 2024 04:02PM

Photo Stories