10th Class & Inter: ఇంటర్, పది పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఫిబ్రవరి 22న జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో 50 పరీక్ష కేంద్రాల్లో 32,895 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు, అలాగే 473 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ |బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ విధించాలలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశానికి అదనపు ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రునాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ హాజరయ్యారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్