Open Schools Exams 2024 :ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంట ర్ పరీక్షలను పకడ్బందీగా
ఈ నెల 25నుంచి మే2 వరకు నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంట ర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ప్రణీత అన్నారు. పరీక్షల నిర్వహణ పై తన కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. జిల్లాలో పది పరీక్షలకు 792 మంది, ఇంటర్ పరీక్షలకు 463 మంది అ భ్యాసకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Also Read : బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది
పది పరీక్షల కోసం మూడు, ఇంటర్ పరీక్షల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు.అభ్యాసకులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లను అధ్యయన కేంద్రాల నుంచి లేదా www. Telanganaopenschool. org వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 3నుంచి 10వరకు పట్టణంలోని ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఇందులో ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.