Tenth Exams 2024 : పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
Sakshi Education
పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
విద్యారణ్యపురి: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, కేజీబీవీల, మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్ హెచ్‌ఎంలతో ఈనెల 27న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై ఒక ప్రకటనలో తెలిపారు. వందశాతం ఫలితాలు సాధించేలా కొంతకాలంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్లిప్‌టెస్టుల్లో విద్యార్థులకు వచ్చిన ఫలితాలను బట్టి హెచ్‌ఎంలతో ఆయా హైస్కూళ్ల వారీగా కలెక్టర్ సమీక్షించనున్నారు.
Also Read : Telangana EM 10th Class Study Material
Published date : 29 Jan 2024 09:23AM