ABVP: అధిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 4న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని జూలై 3న ఒక ప్రకటనలో కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజు చెల్లించని విద్యార్థులకు అనేక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి:
Published date : 04 Jul 2023 03:14PM