పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
Sakshi Education
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
2024 మార్చిలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును విద్యాశాఖ పొడిగించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా విద్యాధికారి భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీలోపు రూ.50 అపరాధ రుసుం, డిసెంబర్ 11వ తేదీ లోపు రూ.200 అపరాధ రుసుం, డిసెంబర్ 20వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. మూడు సబ్జెక్టులు ఉన్న సప్లిమెంటరీ విద్యార్థులు రూ.110 చెల్లించాలని, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు రూ.60 చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 04 Nov 2023 03:16PM