10th Class Evaluation: టెన్త్ మూల్యాంకనానికి డుమ్మా.. రెమ్యునరేషన్ తక్కువని..
ఏప్రిల్ 3వ తేదీ నుంచి నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనానికి ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లను ఎంపిక చేశారు. వారంతా తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. కానీ, 3, 4వ తేదీల్లో కొందరు హాజరు కాలేదు. దీంతో వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు పంపారు. 5వ తేదీన కచ్చితంగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు.
రెమ్యునరేషన్ తక్కువని..
పదో తరగతి పేపర్ల మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు ఒక్కో పేపర్‌కు రూ.10 చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటు టీఏ, డీఏ చెల్లిస్తారు. ఒక్కో ఉపాధ్యాయుడికి రోజూ 40 పేపర్లను ఇస్తున్నారు. 40 పేపర్లకు రూ.10 చొప్పున రూ.400, టీఏ డీఏలు కూడా మరో రూ.300 వస్తుంది. అయితే రెమ్యునరేషన్ సరిపోవడం లేదనే సాకుతో చాలామంది మూల్యాంకనం విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
మూల్యాంకనానికి హాజరు కాని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. వారంతా తప్పనిసరిగా రిపోర్టు చేయాలి. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మూల్యాంకనం చేసే వారికి రెమ్యునరేషన్‌తో పాటు టీఏ, డీఏలు ఇస్తున్నాం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మూల్యాంకనానికి హాజరు కావాలి.
భిక్షపతి, డీఈఓ