ఏపీ టెట్ పరీక్ష విధానం
డీఎస్సీలో టెట్ స్కోరుకూ 20 శాతం వెయిటేజీ ఉండటంతో కేవలం అర్హత కోసమే కాకుండా.. మంచి స్కోరు సాధనకూ కృషి చేయాలి. ఏపీ టెట్–డిసెంబర్ 2017కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు..
అర్హతలు..
టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఎస్‌జీటీ పోస్టులకు అర్హత పరీక్ష. కాగా, రెండో పేపర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్దేశించింది.
పేపర్–1: ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత. ఇంటర్‌లో ఎస్సీ/ఎస్టీ/బీసీ/ దివ్యాంగులకు 45 శాతం మార్కులు. అలాగే 2010 ఆగస్టుకు ముందు ఇంటర్ పాసైన జనరల్ అభ్యర్థులకు 45 శాతం; రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
పేపర్–2: బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు 45 శాతం మార్కుల ఉత్తీర్ణతతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- లాంగ్వేజ్ టీచర్ ఔత్సాహికులు సంబంధిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ ఉత్తీర్ణతతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్‌తో బీఈడీలో ఉత్తీర్ణత.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్‌కు హాజరు కావచ్చు. కానీ, తదుపరి దశలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించే నాటికి డీఈడీ లేదా బీఈడీలలో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీకి అర్హత లభిస్తుంది.
- రెండు పేపర్లుగా: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు పేపర్లు (పేపర్–1, పేపర్–2)గా ఉంటుంది.
- డీఈడీ అర్హతతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల ఔత్సాహికులకు ఉద్దేశించింది. అంటే.. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్దేశించిన పరీక్ష టెట్ పేపర్–1. టెట్ పేపర్ 1 మొత్తం ఐదు విభాగాలుగా ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) ఉంటుంది.
- పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
- చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; లాంగ్వేజ్–1.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; లాంగ్వేజ్–2.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, 30 మార్కులకు; ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్æ 30 ప్రశ్నలు, 30 మార్కులకు ఉంటుంది. ఈ అయిదు పేపర్లలో లాంగ్వేజ్ పేపర్–1 మినహా మిగతా అన్నీ కంపల్సరీ పేపర్లే. లాంగ్వేజ్–1 పేపర్లను అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హత మేరకు ఎంపిక చేసుకోవచ్చు.
- ఇందుకోసం తెలుగు, ఉర్దూ సహా మొత్తం ఎనిమిది లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
- బీఈడీ అర్హతగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ హోదాకు పోటీ పడాలనుకునే అభ్యర్థులకు ఉద్దేశించిన పేపర్.. టెట్ పేపర్–2. ఈ పేపర్ నాలుగు సెక్షన్లుగా 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
- పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
- చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; లాంగ్వేజ్–1.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; లాంగ్వేజ్ 2.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ కోసం మ్యాథ్స్, సైన్స్ 60 ప్రశ్నలు, 60 మార్కులు; సోషల్ స్టడీస్ టీచర్ కోసం సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు, 60 మార్కులకు ఉంటుంది.
- ఇందులో మొదటి మూడు విభాగాలు కామన్‌గా ఉంటాయి. మిగిలిన సబ్జెక్టును తమ సబ్జెక్ట్ మేరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- పేపర్–2లోనూ లాంగ్వేజ్–1 పేపర్‌లో తెలుగు, ఉర్దూ సహా ఏడు భాషలలో అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హత మేరకు సదరు లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
టెట్‌లో కనీస అర్హత మార్కులుగా నిర్దేశించిన శాతాలు కేటగిరీల వారీగా..
- జనరల్ – 60 శాతం; బీసీ – 50 శాతం; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు – 40 శాతం.
- కనీస అర్హత మార్కులు సాధిస్తేనే సదరు స్కోర్‌ను ప్రభుత్వ ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ టెట్ స్కోరుకు ఏడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ర్యాంకు కార్డ్ పొందిన అభ్యర్థి అదే స్కోర్‌తో తదుపరి ఏడేళ్లలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
టెట్ మెటీరియల్, పాత ప్రశ్నాపత్రాలు, ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి.
టెట్ సిలబస్ కోసం క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
టెట్ తాజా షెడ్యూల్ (28.12.2017)
అంశం | తేదీలు |
టెట్ ప్రకటన, ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల | డిసెంబర్ 14, 2017 |
ఫీజు చెల్లింపు | డిసెంబర్ 18 నుంచి జనవరి 13 వరకు |
ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణ | డిసెంబర్ 18 నుంచి జనవరి 17 వరకు |
పనిదినాల్లో హెల్ప్‌లైన్ డెస్క్ సేవలు | డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 14 వరకు |
దరఖాస్తులు, సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ | డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు |
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం | జనవరి 23 నుంచి |
టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | జనవరి 24 నుంచి |
పేపర్-1, పేపర్-2 ఆన్‌లైన్ పరీక్షల షెడ్యూల్ | ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు |
ప్రాథమిక ‘కీ’ విడుదల | ఫిబ్రవరి 16 |
ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ | ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వరకు |
ఫైనల్ ‘కీ’ విడుదల | ఫిబ్రవరి 24 |
తుది విడత ఫలితాల ప్రకటన | ఫిబ్రవరి 26 |
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం: డిసెంబర్ 18, 2017
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 18, 2017
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2018
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 9, 2018
ఆన్‌లైన్ పరీక్ష తేది: 2018 జనవరి 17 నుంచి 27 వరకు
ప్రాథమిక కీ విడుదల: జనవరి 29, 2018
ఫైనల్ కీ విడుదల: ఫిబ్రవరి 6, 2018
తుది ఫలితాలు: ఫిబ్రవరి 8, 2018
వెబ్‌సైట్: https://aptet.apcfss.in/