Teacher Eligibility Test: 3న ఉపాధ్యాయ అర్హతా పరీక్షలు
కోలారు: జిల్లాలో ఎంపిక చేసిన 17 కేంద్రాల్లో సెప్టెంబరు 3న ఉపాధ్యాయుల అర్హతా పరీక్ష(టెట్) నిర్వహిస్తారని జిల్లాధికారి అక్రంపాషా తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టెట్‌కు మొత్తం 7395 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 35 విద్యా జిల్లాల్లో 711 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్ష 2 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు సమయానికి సరిగ్గా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించేది లేదన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.
చదవండి: TET 2023 notification: సెప్టెంబర్ 3న టెట్‌కు అన్ని ఏర్పాట్లు