Indian Students Protest: కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్‌లాండ్ ప్రావిన్స్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.
అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు.
US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!
దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో..
తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Sahitya Akademi Fellowship: సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్‌లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్‌కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.