Skip to main content

Telangana Gurukulam Jobs Exam Dates 2023 : 9,210 గురుకుల ఉద్యోగాలు.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు 9,210 పోస్టులకు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్న‌ది.
TS Gurukulam jobs 2023
TS Gurukulam Jobs Exam Dates 2023

9,210 పోస్టులకు గాను  2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు.

➤☛ Eklavya Model Residential Schools Jobs 2023 : భారీ నోటిఫికేష‌న్‌.. ఏకలవ్య పాఠశాలల్లో 38480 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?
పరీక్షలు నిర్వహించడానికి, ఫలితాలను వేగంగా ప్రకటించడానికి సీబీఆర్‌టీ విధానమే మంచిదని గురుకుల బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబ‌ర్‌లో ఫలితాలను వెల్లడించి, మెరిట్‌ జాబితాలను రూపొందించనుంది. అలాగే అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, సెప్టెంబరులోనే పలు పోస్టులకు డెమో తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని చూస్తోంది. డెమో తరగతుల్లేని పోస్టులను సెప్టెంబరు, అక్టోబరు నాటికి భర్తీ చేయనుంది. దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరేలా చూడాలని లక్ష్యం పెట్టుకుని.. గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు ముందుకు సాగుతుంది.

9,210 గురుకుల ఉద్యోగాలు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

ts gurukulam jobs success tips in telugu

సిలబస్‌పై అవగాహన :

తెలంగాణ గురుకుల పోస్ట్‌లకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌ క్రమంలో ముందుగా.. సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్‌ అంశాలను పరిశీలించాలి. సదరు టాపిక్స్‌ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. సిలబస్‌పై అవగాహన పొందిన అభ్యర్థులు.. వెంటనే ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. అదే విధంగా పరీక్షల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పాత ప్రశ్న పత్రాలను..

అభ్యర్థులు టీచర్‌ నియామకాలకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటంది. గతంలో నిర్వహించిన డీఎస్‌సీ, టెట్‌ వంటి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. పెడగాజీ విషయంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది. 

జనరల్‌ స్టడీస్ ఫోక‌స్ ఇలా..

  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి పేపర్‌-1లో రాణించాలంటే.. జనరల్‌ స్టడీస్‌కు సంబంధించి భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పబ్లిక్‌ పాలసీ, సామాజిక వివక్ష; వికలాంగులు, గిరిజనులకు సంబంధించిన హక్కులు; సమ్మిళిత విధానాలు; సమాజ సంస్కృతి, నాగరికత, వారసత్వం; భారత్, తెలంగాణ కళలు, సాహిత్యం; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు; పర్యావరణ సమస్యలు-విపత్తుల నిర్వహణ, నివారణ, ఉపశమన విధానాలు; భారత్, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి; తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రాధాన్యంగా తెలంగాణలోని సామాజిక-ఆర్థిక చరిత్ర, రాజకీయ-సాంస్కృతిక చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • అనలిటికల్‌ ఎబిలిటీస్‌: లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లపై దృష్టిపెట్టాలి. 
  • ఇంగ్లిష్‌: ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీ, వర్డ్స్‌ అండ్‌ సెంటెన్సెస్, డైరెక్ట్‌-ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, సెంటెన్స్‌ కరెక్షన్, యాక్టివ్‌-ప్యాసివ్‌ వాయిస్, యాంటానిమ్స్, సినానిమ్స్‌ వంటి బేసిక్‌ ఇంగ్లిష్‌ అంశాలపై పట్టు సాధించాలి.

☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం త‌థ్యం..

పుస్తకాలను..

ఆయా పోస్ట్‌లకు సంబంధించి పేర్కొన్న సబ్జెక్ట్‌ పేపర్లలో రాణించేందుకు అభ్యర్థులు.. పీజీ స్థాయి అకడమిక్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆయా అంశాలను వర్తమాన పరిణామాలతో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో అప్లికేషన్‌ దృక్పథంతో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

పెడగాజీని అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో..

జూనియర్‌ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ పోస్ట్‌ల రాత పరీక్షలో ఒక పేపర్‌గా ఉండే పెడగాజీని అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ఇందుకోసం పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి. అదే విధంగా బోధన పద్ధతులు, మూల్యాంకన, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యకేషన్, శిశు విద్యా ప్రణాళిక, ఆర్‌టీఈపై అవగాహన పెంచుకోవాలి.

పోస్టుల వివరాలు ఇవే..

  • డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ(ఫిజికల్‌ డైరెక్టర్‌), లైబ్రేరియన్‌-868 పోస్టులు 
  • జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్స్‌-2008 పోస్టులు 
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ)-1,276 పోస్ట్‌­లు
  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ)- 4,020 పోస్ట్‌లు
  • ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ టీచర్స్‌ - 134 పోస్ట్‌లు
  • గరుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్స్‌-434 పోస్ట్‌లు
  • మ్యూజిక్‌ టీచర్స్‌-124 పోస్ట్‌లు
  • క్రాఫ్ట్‌ టీచర్, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌-92 పోస్ట్‌లు
  • గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌-275 పోస్టులు
Published date : 11 Jul 2023 07:00PM

Photo Stories