Staff Nurse Appointment: స్టాఫ్ నర్సులకు పోస్టింగ్‌లు
ఇందులో కొందరు కొత్తవారు ఉండగా.. చాలా మంది ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. 2022 డిసెంబర్ 30న స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2023 ఆగస్టు 2న అర్హత పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది డిసెంబర్ 28న ఫలితాలు విడుదలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్డర్ కాపీల జారీలో జాప్యం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. స్టాఫ్ నర్సుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇన్నేళ్ల ఎదురు చూపులకు తెర పడింది.
చదవండి: Nursing Officers Results: నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల
మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు
జిల్లాలో 12 ప్రాథమిక, అర్బన్ పీహెచ్‌సీలు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి పరిధిలో సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. రెగ్యులర్ స్టాఫ్ నర్సులు సరిపడా లేక ఇన్ని రోజులు కాంట్రా క్టు పద్ధతిన నియామకం చేసి వారి సేవలను వినియోగించుకుంటున్నారు.
రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా ప్రస్తుతం పోస్టింగ్‌లు ఇచ్చారు. జిల్లాకు 58 మంది స్టాఫ్ నర్సులను కేటాయించగా.. ఒక్కరు మాత్రం రిపోర్టు చేయాల్సి ఉంది. 57 మందిని మండలాల వారీగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చదవండి: TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివరాలు ఇవే..
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు
స్టాఫ్ నర్సుగా అర్హత సాధించి ఉద్యోగంలో చేరబోతున్న వారికి ఈనెల 31న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లడానికి జిల్లా నుంచి 57 మందికి ప్రత్యేక ఐడీ కార్డులు అందజేశారు. రెండు ప్రత్యేక బస్సుల్లో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి ఆధ్వర్యాన ఆరుగురు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పీహెచ్‌ఎన్, సెక్యూరిటీగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వెంట వెళ్లనున్నారు.