1,904 Jobs: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఆరు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు జనవరి 11 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. జనవరి 31తో ముగియనుంది. ఫిబ్రవరి 15 నుంచి హాల్‌టికెట్లను వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్ http://tshc.gov.inను సందర్శించవచ్చు.
చదవండి:
Published date : 05 Jan 2023 01:11PM