Government Job Success Tips : ఏ ఉద్యోగాని కైనా చివరి వరకు పట్టు.. కొలువు తుది మెట్టు
ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ‘సాక్షి’ మీడియా(సాక్షి ఎడ్యుకేషన్.కామ్), రైట్ చాయిస్ అకాడమీ సంయుక్త ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మే 31వ తేదీ (మంగళవారం) ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఈ సదస్సుకు అభ్యర్థులు హాజరు కాగా, ముఖ్యఅతిథిగా సీపీ వారియర్ మాట్లాడారు. ఏ పోటీ పరీక్షలకైనా కష్టపడి చదవాల్సిందేనని... ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు పోటీ ఎక్కువగా ఉన్నందున ప్రణాళిక అవసరమని తెలిపారు.
Harish Rao: నోటిఫికేషన్‌కు రెండు నెలల సమయం ఉండేలా.. ఈ ఏడాదంతా పరీక్షలే..
కోచింగ్ సెంటర్లలో చేసే బోధనకు తోడు అభ్యర్థులు సొంతంగా మరింత కష్టపడితేనే ఫలితం వస్తుందని చెప్పారు. సిలబస్ ఆధారంగా చదువుకోవడం, మాదిరి ప్రశ్నపత్రాలను రాస్తూ సమయాన్ని నిర్దేశించుకోగలిగితే విజయం వరిస్తుందని తెలిపారు. పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సబ్జెక్టుతో పాటు అంతకు రెట్టింపు స్థాయిలో మైదానంలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు.
TS Police Jobs: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు హెచ్చరిక.. ప్రిలిమినరీ రాతపరీక్ష ఇలా..!
ఏ ఉద్యోగాని కైనా చివరి..
ఉద్యోగం సాధించే వరకు సోషల్ మీడియా, ఇంటర్నెట్ తదితర అంశాలన్నీ వదిలేసి కేవలం లక్ష్యంపైనే దృష్టి సారించాలని చెప్పారు. సివిల్స్ పరీక్ష రాసిన 6లక్షల మందిలో 9వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధిస్తే, అన్ని పరీ క్షల అనంతరం 650 మందిని ఎంపిక చేశారని తెలిపారు. ఇలా ఏ ఉద్యోగాని కైనా చివరి వరకు పట్టు సడలకుండా కృషి చేయడం ముఖ్యమని సీపీ వెల్లడించారు. తాను సైతం ఒకనాడు ఉద్యోగం కోసం ఎదురుచూశానని, ఇప్పుడు సూచనలు చేసే స్థాయికి ఎదిగానని.. అందరూ కష్టపడితే ఈ స్థాయికి చేరడం సులువవుతుందని సీపీ వెల్లడించారు.