Blind Women’s: హిమాచల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు.
చదవండి: Dwarapureddy Chandramouli: విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితురాలైంది.
చదవండి: UPSC Civils Ranker: ఇందుకే సివిల్స్ రాశాను.. వారు మనకన్నా గొప్పేం కాదు..