Skip to main content

Asha Worker Salary Hike Demand 2024 : ఆశా కార్యకర్తలకు వేతనం రూ.18వేలు ఇవ్వాల్సిందే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇటీవ‌లే నిరుద్యోగులు ఆందోళ‌న‌లు చేసిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు వేలాది మంది ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు.
telangana asha worker salary hike demand 2024

వీరిని పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. 

వేతనం రూ.18వేలు ఇవ్వాలని..

asha workers salary hike news

పోలీసులకు, ఆశా కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 15 రోజుల సమ్మెలో ఇచ్చిన  హామీలు, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. మా హామీలను అమలు చేయ‌క‌పోతే రాష్ట్రవ్యాప్తంగా ద‌ర్నా చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

asha workers salary hike newsasha workers salary hike live updates
Published date : 30 Jul 2024 07:58PM

Photo Stories