Skip to main content

TSPSC JL Syllabus : 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. సిల‌బ‌స్ ఇదే.. ఈ పుస్త‌కాలు చ‌దివితే చాలు..!

ఇటీవల తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. జూనియర్ లెక్చరర్‌(జేఎల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. దీనిద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో.. జూనియర్‌ లెక్చరర్స్‌గా స్థిరపడే అవకాశం కల్పిస్తోంది.
TSPSC JL Books
TSPSC JL Preparation Tips

ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.54,220-రూ.1,33,630 వేతన శ్రేణి అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్‌ లెక్చరర్ ప‌రీక్ష సిల‌బ‌స్‌.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎలాంటి పుస్త‌కాలు చ‌ద‌వాలి.. మొద‌లైన అంశాల‌పై నిపుణుల స‌ల‌హాలు.. సూచ‌న‌లు మీకోసం..

చ‌ద‌వండి: TSPSC Polytechnic Lecturer notification: మీరూ అవుతారా.. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌!

ప‌రీక్ష విధానం :tspsc group 2 success plan
☛ జేఎల్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్ష రెండు పేపర్లుగా 450 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.
☛ పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు-150 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
☛ పేపర్‌ 2 సంబంధిత సబ్జెక్ట్‌(పీజీ స్థాయి)పై 150 ప్రశ్నలు-300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
☛ పేపర్‌-2లో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌తో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
☛ పేపర్‌-1ను తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో, పేపర్‌-2ను ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తారు. లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌లకు మాత్రం సంబంధిత లాంగ్వేజ్‌లో పరీక్ష ఉంటుంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ అంశాలపై ప‌ట్టు సాధిస్తే..

jl success tips


అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా.. అంతర్జాతీయ సంబంధాలు, పరిణామాలపైనా పట్టు సాధించాలి. వీటితోపాటు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, తాజా పరిస్థితులు, రక్షణ రంగంలో ప్రయోగాలు, విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలు కూడా తెలుసుకోవాలి. చరిత్ర విషయంలో భారత, తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకూ.. పలు ముఖ్యమైన అంశాలను ఔపోసన పట్టాలి.అదే విధంగా తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలను కూడా చదవాలి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై పట్టు సాధించాలి. అనలిటికల్‌ ఎబిలిటీలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్‌ అంశాలను అధ్యయనం చేయాలి.

చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

సబ్జెక్ట్‌ పేపర్లు.. దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇవే..
సబ్జెక్ట్‌ పేపర్ల విషయంలో అభ్యర్థులు పీజీ స్థాయిలోని అకడమిక్‌ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

బోటనీ :సైకాలజీ,మైకాలజీ,బ్యాక్టీరియా,వైరస్‌లు, బ్రైయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్, టాక్సానమీ ఆఫ్‌ యాంజియోస్పెర్మ్స్, ప్లాంట్‌ అనాటమీ అండ్‌ ఎంబ్రియాలజీ,ప్లాంట్‌ రిసోర్స్‌ యుటిలైజేషన్‌ అండ్‌ కన్వర్జేషన్, ప్లాంట్‌ ఎకాలజీ,సెల్‌ బయాలజీ,కైటోజెనెటిక్,ప్లాంట్‌ సైకాలజీ,బయో టెక్నాలజీ అండ్‌ జనెటిక్‌ ఇంజనీరింగ్‌.

కెమిస్ట్రీ : ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలలోని అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

సివిక్స్ : స్టేట్‌ అండ్‌ నేషన్‌ స్టేట్స్, కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ ఐడియాలజీస్, డెమోక్రసీ, ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్, యూనియన్‌ గవర్నమెంట్, కాన్‌స్టిట్యూషనల్‌ అండ్‌ అదర్‌ బాడీస్, లోకల్‌ బాడీస్, జ్యుడిషియరీ, ఎలక్టోరల్‌ సిస్టమ్‌ అండ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా అండ్‌ వరల్డ్‌.

కామర్స్ : ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్, కాస్ట్‌ అకౌంటింగ్‌ అండ్‌ కంట్రోల్, మేనేజీరియల్‌ ఎకనామిక్స్, ఆర్గనైజేషన్‌ థియరీ అండ్‌ బిహేవియర్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌.

ఎకనామిక్స్ : మైక్రో ఎకనామిక్స్‌లో యుటిలిటీ అనాలిసిస్, ప్రాడక్షన్‌ అనాలిసిస్, మార్కెటింగ్‌ స్ట్రక్చర్‌ అనాలిసిస్‌; మ్యాక్రో ఎకనామిక్స్‌లో నేషనల్‌ ఇన్‌కం అనాలిసిస్, థియరీస్‌ ఆఫ్‌ ఇన్‌కం అండ్‌ ఎంప్లాయ్‌మెంట్, థియరీస్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇంట్రస్ట్‌ రేట్, సప్లై ఆఫ్‌ మనీ అండ్‌ డిమాండ్‌ ఫర్‌ మనీ, ఇన్‌ఫ్లేషన్‌ అండ్‌ ట్రేడ్‌ సైకిల్స్, పబ్లిక్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలు(రెవెన్యూ, ట్యాక్సేషన్‌ తదితర). వీటితోపాటు ఇంటర్నేషనల్‌ ట్రేడ్, బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్, ఎక్స్ఛేంజ్‌ రేట్స్‌ వంటి ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌ అంశాలపైను చదవాలి. అదే విధంగా ఎకనామిక్స్‌కు సంబంధించి తెలంగాణ ఎకానమీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణలో మానవ వనరులు, జీఎస్‌డీపీ, నిరుద్యోగిత, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, మౌలిక సదుపాయాల రంగం వంటి అంశాలపై అవగాహన పొందాలి.

హిస్టరీ : హిస్టరీలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారత దేశ చరిత్రల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా చరిత్రలోని కీలక ఘట్టాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ చరిత్ర అంశాలపై పట్టు సాధించాలి.

మ్యాథమెటిక్స్ : రియల్‌ అనాలిసిస్, మెట్రిక్‌ స్పేసెస్, ఎలిమెంటరీ నెంబర్‌ థియరీ, గ్రూప్‌ థియరీ, రింగ్‌ థియరీ, వెక్టార్‌ స్పేసెస్, థియరీ ఆఫ్‌ మ్యాట్రిసెస్, కాంప్లెక్స్‌ అనాలిసిస్, ఆర్డినరీ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, పార్షియల్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, సాలిడ్‌ జామెట్రీ.

ఫిజిక్స్ : మ్యాథమెటికల్‌ మెథడ్స్‌ ఆఫ్‌ ఫిజిక్స్, క్లాసికల్‌ మెకానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ థియరీ, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఫిజిక్స్, కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఫిజిక్స్‌.

జువాలజీ : జనరల్‌ కాన్సెప్ట్స్, నాన్‌-క్రోడేటా, క్రోడేటా, సెల్‌ బయాలజీ, జెనెటిక్స్, సిస్టమ్‌ అండ్‌ సెల్‌ సెకాలజీ, ఎవాల్యుయేషన్, డెవలప్‌మెంటల్‌ బయాలజీ, హిస్టాలజీ, ఎకాలజీ, ఇమ్యునాలజీలకు సంబంధించిన అన్ని అంశాలు చదవాలి.

లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌లకు ఇలా చ‌దివితే..
తెలుగు, ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లిష్, అరబిక్, హిందీ, సంస్కృతం సబ్జెక్ట్‌ జేఎల్‌ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు ఆయా లాంగ్వేజ్‌లకు సంబంధించి బేసిక్‌ గ్రామర్‌ మొదలు ఆయా భాషల్లో సాహిత్యం, పోయెట్రీ, ప్రముఖ రచయితల గేయాలు, ప్రముఖ రచయితలు, ఆయా భాషలు-మాండలికాలు తదితర అంశాలను ఔపోసన పట్టాలి. 

ఈ పుస్తకాలే చ‌దివితే..

tspsc jl books

సబ్జెక్ట్‌ పేపర్‌కు సంబంధించి అభ్యర్థులు పీజీ పుస్తకాలను ఆధారంగా చేసుకుని అధ్యయనం సాగించాలి. తాము పోటీ పడే సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ పుస్తకాల్లోని అంశాలను అన్ని కోణాల్లో ప్రాక్టీస్‌ చేయాలి. అప్లికేషన్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పీజీ పుస్తకాలతో పాటు బ్యాచిలర్‌ డిగ్రీ పుస్తకాలను చదవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

టీఎస్‌పీఎస్‌సీ జేఎల్‌ పోస్ట్‌లకు రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేపడతారు. రిజర్వేషన్లు, లోకల్‌ కేడర్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా తుది విజేతల జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. రాత‌ప‌రీక్ష‌ను 2023 జూన్‌ లేదా జూలైలో నిర్వహించే అవకాశం.

☛ TSPSC Group 4 Success Tips : 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాలు.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే.. ఉద్యోగం మీదే.. ముఖ్యంగా అడిగే ప్ర‌శ్న‌లు ఇవే..

Published date : 10 Feb 2023 07:03PM

Photo Stories